🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 4:04 pm Posted by : NAA ANVESHANA

డ్రైవర్ శిక్షణ విజయవంతం.. 24వ బ్యాచ్‌కు సర్టిఫికెట్ల ప్రదానం

News Image
కాకినాడ: కాకినాడ డిపోలో నిర్వహించిన 24వ బ్యాచ్ డ్రైవర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ బ్యాచ్‌కు చెందిన E-16 డ్రైవర్లకు 32 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించారు.
డిపో మేనేజర్ గంగుమళ్ళ రామలక్ష్మీ దేవి అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి జిల్లా ప్రజా రవాణా అధికారి కె. రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న డ్రైవర్లకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా కె. రమేష్ మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణలో రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు ఎ. మాలింబాషా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న డ్రైవర్లందరికీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home