🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 8:47 pm Posted by : A2TV NEWS

కాకినాడ బాలా చెరువు సెంటర్‌లో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిల్వ.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

కాకినాడ నగరంలోని బాలా చెరువు సెంటర్‌లో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై మురుగునీరు నిల్వ ఉండటంతో అటుగా వెళ్లే వాహనదారులు, నడుచుకుంటూ వెళ్లే ప్రజలు అవస్థలు పడుతున్నారు. దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిల్వ ఉన్న నీటిని తొలగించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home