🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 9:11 pm Posted by : NAA ANVESHANA

టీచర్స్ కాలనీలో బంగారు గొలుసు చోరీ

News Image
రాజమహేంద్రవరం: నగరంలోని టీచర్స్ కాలనీ గోశాల సమీపంలో దొంగలు మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించారు. కోర్టు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న గుత్తుల విజయలక్ష్మి మెడలోని 40 గ్రాముల మంగళసూత్రం గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీని విలువ రూ.5 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ అప్పారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.
🏠 Home