🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 9:16 pm Posted by : NAA ANVESHANA

మాదకద్రవ్యాల నేరస్థుడిపై ఫిట్ ఎన్ డి పి ఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు

News Image
రాజమహేంద్రవరం, నవంబర్ 2: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణలో భాగంగా గారా రవితేజ అలియాస్ గ్యాంగ్‌స్టర్ తేజ (31)పై పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు అమలయ్యాయి. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు త్రీటౌన్ సీఐ వి. అప్పారావు నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న రవితేజకు నవంబర్ 2న ఉత్తర్వులు అందజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు.
🏠 Home