🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 03 November 2026, 2:30 am Posted by : జర్నలిస్టు శ్రీనివాస్

గరుడ వాహనంపై మలయప్ప.. గోవింద నామస్మరణతో వాడపల్లి!

News Image
కోనసీమ తిరుమల వాడపల్లిలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు గరుడ వాహనంపై మలయప్ప అలంకరణలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, మహా సుదర్శన హోమం, విశేషార్చనలు నిర్వహించారు. గరుడ సేవతో వాడపల్లి క్షేత్రం భక్తిభావంతో పులకించింది.
🏠 Home