🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 11:25 am Posted by : జర్నలిస్ట్ శ్రీనివాస్

భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ.. ప్రత్యేక పూజల్లో మంత్రి సుభాష్, చైర్మన్ మేడిశెట్టి శేషారావు

News Image
రామచంద్రపురం లోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమం భక్తిపూర్వకంగా సాగింది. ఆలయ చైర్మన్ చెరుకుపల్లి గణేష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home