🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 1:35 pm Posted by : జర్నలిస్ట్ శ్రీనివాస్

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: ఎమ్మెల్యే బండారు

News Image
కొత్తపేట, నవంబర్ 4: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని, వందశాతం పోలింగ్ నమోదుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
🏠 Home