🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 2:14 pm Posted by : YACOB SHEIK

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల భద్రతపై ఎస్పీ డి. నరసింహ కిషోర్ పర్యవేక్షణ

News Image
తూర్పుగోదావరి జిల్లా: జిల్లాలోని 21 మండలాల్లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. TRACK అప్లికేషన్ ద్వారా పోలీసు వాహనాల కదలికలు, లైవ్ లొకేషన్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలు భయాందోళనలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎన్నికల ఉల్లంఘనలపై డయల్ 112 లేదా 9154880083కు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🏠 Home