🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 5:43 pm Posted by : DONAM NEWTON

పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం.. పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్!

News Image
ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలోని పోలింగ్ కేంద్రాలను సహాయ కలెక్టర్ ప్రియతో కలిసి సందర్శించి పోలింగ్ సరళి, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home