🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:22 pm Posted by : YACOB SHEIK

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత జోరు.. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగం

News Image
కొండగుంటూరు గ్రామంలో యువ ఓటర్ల చురుకైన భాగస్వామ్యం

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కొండగుంటూరు గ్రామంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడి ఓటు వేయడం ప్రజాస్వామ్యంపై యువతకు పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. గ్రామాభివృద్ధికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెంటగట్ల మణికుమార్, పెమ్మనబోయిన కోటి, పెంగట్ల మణికంఠ, పెమ్మనబోయిన నరేష్, పెమ్మనబోయిన వెంకటేష్, కోన శ్రీనివాస్, పెమ్మనబోయిన రామదుర్గ, పెంటగట్ల వెంకటేష్ తదితర యువ ఓటర్లు పాల్గొన్నారు
🏠 Home