🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 3:22 pm Posted by : యార్లగడ్డ నరేష్ కుమార్

జాతీయ స్థాయికి జాంపేట విద్యార్థి ప్రసాద్ దూకుడు.. ఎమ్మెల్యే వాసు అభినందనలు

News Image
రాజమహేంద్రవరం జాంపేట ప్రభుత్వ ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థి ముప్పిడి ప్రసాద్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గోకవరం వార్షిక క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి, జిల్లా స్థాయిలోనూ సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, నగరానికి గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు పాఠశాలకు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
🏠 Home