🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:13 pm Posted by : YACOB SHEIK

42 డివిజన్లలోనూ కూటమి జెండా ఎగురవేస్తాం. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తాం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

News Image
రాజమహేంద్రవరం: రానున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 42 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. రెడ్డి కన్వెన్షన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 9,700 మందితో నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు లేవని, అభ్యర్థుల ఎంపికలో కూటమి నిర్ణయమే అంతిమమన్నారు. నగర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పారిశుధ్యం, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, ఎన్నికల్లో కూటమి ఐక్యతతో విజయం సాధిస్తామని వెల్లడించారు.
🏠 Home