🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:18 pm Posted by : YACOB SHEIK

క్లాప్ వాహనాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం. సీపీఎం

News Image
రాజమహేంద్రవరం, నవంబర్ 6: నగరంలో క్లాప్ వాహనాల నిర్వహణ అస్తకేటగిరీ (Category)వ్యస్తంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ విమర్శించారు. మొత్తం 72 వాహనాల్లో 12 మరమ్మతులకు నిలిచిపోగా, మిగిలిన వాహనాలకు గ్యాస్ లేక చెత్త సేకరణ నిలిచిపోయిందన్నారు. కాంట్రాక్టర్‌కు రూ.4.5 కోట్ల బకాయిలు ఉండటంతో కార్మికులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపారు. పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని, డిసెంబర్‌లో కాంట్రాక్టు ముగిసిన అనంతరం వాహనాలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బి. పవన్, ఎస్ఎస్ మూర్తి, కరి రామకృష్ణ, బి. పూర్ణిమ రాజ్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
🏠 Home