వరంగల్‌లో కల్తీ కారం, పసుపు తయారీ కేంద్రంపై మెరుపు దాడి.. 2,250 కిలోలు స్వాధీనం!
వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త తనిఖీలు నిర్వహించారు. అనుమతులు, లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న కల్తీ కారం, పసుపు పొడిని గుర్తించారు. కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2,250 కిలోల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5.92 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.