🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 9:30 am Posted by : YACOB SHEIK

సర్పంచ్‌కు 25.. వార్డు సభ్యులకు 20 ఎన్నికల గుర్తులు!

News Image
గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 26, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, బ్యాట్, టెలిఫోన్, కుండ, అరటిపండు, అనాసపండు సహా 25 గుర్తులు కేటాయించారు. వార్డు సభ్యులకు ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టౌ, బీరువా, కెమెరా, క్యారమ్ బోర్డు, బెండకాయ, కోటు సహా 20 గుర్తులు ఖరారు చేశారు. వీటికి అదనంగా నోటా ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే మరిన్ని గుర్తులు కేటాయించనున్నారు.
🏠 Home