క్లోమగ్రంథి వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు.. సకాలంలో వైద్యమే ప్రాణరక్షణ!
గ్యాస్, అసిడిటీగా భావించి కడుపునొప్పికి సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఆకస్మిక కడుపునొప్పి, కామెర్లు, కారణం లేకుండా బరువు తగ్గడం క్లోమగ్రంథి వ్యాధులకు హెచ్చరిక సంకేతాలని తెలిపారు. పాంక్రియాటైటిస్, క్యాన్సర్ వేర్వేరు వ్యాధులని, ప్రతి సమస్యకూ ఆపరేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. అత్యాధునిక ఎండోస్కోపీ చికిత్సలతో యశోద హైటెక్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గోదావరి జిల్లాల ప్రజలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో నిపుణులను సంప్రదించాలని సూచించారు.