అమావాస్య పర్వదినాన వైభవంగా శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం.. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం!
రాజమహేంద్రవరం, నవంబర్ 9: ఆశ్వీయుజ మాస అమావాస్యను పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండితుల వేదమంత్రాల నడుమ దానంశెట్టి వెంకటేశ్వర్లు, రాజేశ్వరి దంపతులు హోమంలో పాల్గొన్నారు. భారతదేశంలో తొలిసారిగా వాహనంతో కూడిన మహాలక్ష్మి హోమం నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమానికి భక్తులు, పలువురు ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.