దేవరపల్లి ముంపు బాధితులను ఆదుకోవాలి. జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి
**దేవరపల్లి:** గ్రామంలో ముంపు ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా బాధితులను అధికారులు పరామర్శించకపోవడం దారుణమని జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. యూనియన్ బ్యాంక్ సందు, మారుతీనగర్, అంబేద్కర్ నగర్, బాబు జగ్జీవన్ రావు నగర్ ప్రాంతాల్లో ముంపు బాధితులకు తక్షణ సహాయం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కోరింది. నష్టాలను అంచనా వేసి ప్రభుత్వ పరిహారం అందించాలని, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టి ముంపు ప్రాంతాలను శుభ్రం చేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.