జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని ఓ డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో స్థానికంగా కొంతసేపు భయాందోళన నెలకొంది.మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం వెంటనే సహకరణ స్థలానికి చేరుకున్న ఫైర్ ఆఫీసర్ మరియు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేశారు.అప్పటికే పూర్తిగా ఫర్నిచర్ దగ్ధం.సుమారుగా మూడు లక్షలు ఆస్థి నష్టం జరిగింది అని సమాచారం.విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, కార్యాలయాల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.