🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 5:40 pm Posted by : DONAM NEWTON

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

News Image
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ప్రత్తిపాడు మండలం రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, వైద్యులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, పారిశుధ్యం, ల్యాబ్ పరీక్షలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ఉచిత మందులు తప్పనిసరిగా అందించాలని సూచించారు. అనంతరం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని పూజలు, గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
🏠 Home