🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 3:45 pm Posted by : జర్నలిస్ట్ శ్రీనివాస్

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.50 వేల విరాళం!

News Image
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని ప్రసిద్ధ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన దండు సత్యనారాయణ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.50,000 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, శేష వస్త్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
🏠 Home