మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి!
రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని, రాజమహేంద్రవరం మేయర్ పదవిని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎన్నికలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలు పదవులు, పార్టీ బాధ్యతల్లోనూ సముచిత స్థానం కల్పించాలని స్పష్టం చేశారు.