సింహ వాహనంపై యోగనారసింహుడు.. వాడపల్లిలో భక్తిభావం!
వాడపల్లి: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఆదివారం వైభవంగా కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ బహుళ సప్తమి సందర్భంగా ఆలయంలో అర్చకుల ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాస్నపనం, ప్రధాన హోమాల అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీనివాస కల్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి విశేషార్చనలు, చతుర్వేద స్వస్తి వంటి కార్యక్రమాలు జరిగాయి. రాత్రి యోగనారసింహ అలంకరణలో స్వామివారిని సింహవాహనంపై ఊరేగించడం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య సింహ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది....