జోరు వానలోనూ బత్తుల వెంకటలక్ష్మి ఎన్నికల ప్రచారం

సీతానగరం, నవంబర్ 2: కాటవరం గ్రామంలో జోరువానను లెక్కచేయకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్‌లో 3వ నంబర్ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.