పుణ్యానికి పోతే పాపం ఎదురైంది! తుఫాను బాధితులకు ఆశ్రయమిస్తే.. పాఠశాలను ధ్వంసం చేసి, విలువైన సామాగ్రి చోరీ
పుణ్యానికి పోతే పాపం ఎదురైంది! తుఫాను బాధితులకు ఆశ్రయమిస్తే.. పాఠశాలను ధ్వంసం చేసి, విలువైన సామాగ్రి చోరీ కాకినాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలన్న మానవతా దృక్పథంతో పాఠశాల తలుపులు తెరిచిన యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది. తుఫాను బాధితులకు ఆశ్రయం కల్పించి, విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్ సౌకర్యం సైతం ఏర్పాటు చేస్తే.. అదే పాఠశాలను కొందరు దుండగులు విధ్వంసం చేసి, విలువైన సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన కాకినాడ నగరంలో కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల సంభవించిన తుఫాను నేపథ్యంలో కాకినాడ డెయిరీ ఫామ్ సెంటర్ సమీపంలోని ఏఎంజీ స్కూల్‌ను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారు. తుఫాను బాధితులకు ఎలాంటి...