తుఫాన్ తో రైతుల అల్లకల్లోం...!
నేలకొండపల్లి నవంబర్:04( నా అన్వేషణ నా నిఘా. ప్రతినిధి) నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాల లో వరస తుఫాన్ తో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు అల్లాడిపోతున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే నీటి పాలవుతుంటే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మండలం లోని మోటాపురం, రాజేశ్వరపురం, అమ్మగూడెం తదితర గ్రామాలలో బుధవారం ఏవో యం.రాధ వాలిన పంటలను పరిశీలించారు. మంగాపురంతండా లో సర్పంచ్ ధీరావత్ ఆశోకరాణి, చెరువుమాధారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యాక్షుడు ధీరావత్ రాధాకృష్ణమూర్తి లు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ఓదార్చారు. మండలం లోని అనేక గ్రామాలలో పంటలు నేలవాలి...