జీబీఆర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గొలుగూరి జగన్నాథరెడ్డి కన్నుమూత
అనపర్తి జీబీఆర్ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ గొలుగూరి జగన్నాథరెడ్డి (78) బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లపాటు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా సేవలందించిన ఆయన, పదవీ విరమణ అనంతరం అకడమిక్ అడ్వైజర్‌గా కొనసాగారు. ఆయన మృతి పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.