జనసేనకు 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు. అనుశ్రీ సత్యనారాయణ
రాజమహేంద్రవరం: మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని అందించిన ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్‌పై ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు అభినందనలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంట స్వరూప, ప్రియ సౌజన్య, వైవీడీ...