కందుకూరి రాజ్యలక్ష్మికి ఘన నివాళి.. 84 మంది వృద్ధులకు పింఛన్ల పంపిణీ

రాజమహేంద్రవరం: వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆనందా గార్డెన్స్‌లో క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్తిబాబు అధ్యక్షతన కందుకూరి రాజ్యలక్ష్మి జయంతి, వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు కాసా జయప్రద, కాసా ప్రభాకర్, బి.అనూరాధ రాజ్యలక్ష్మి సేవలను స్మరించుకున్నారు. అనంతరం 84 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.42 వేలు పంపిణీ చేశారు. కె.సుష్మ తన కుమారుడి జన్మదినం సందర్భంగా 100 మంది వృద్ధులకు అల్పాహారం అందించారు