కడియం మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

కడియం: కడియం మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి నేతల మల్లికార్జున రావు తెలిపారు. ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాజానగరం రోడ్డులోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సైన్స్ బ్లాక్‌లో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకే గుర్తింపు కార్డులతో కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.