ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్.. కేంద్రాలను పరిశీలించిన మంత్రి సుభాష్

రామచంద్రపురం నియోజకవర్గంలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి కారణమని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.