గాదరాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు

గాదరాడ:** జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాదరాడ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులు సాధారణ పౌరుల మాదిరిగా వరుసలో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. గ్రామస్థాయి అభివృద్ధి, సమర్థవంతమైన పాలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.