కరప, కాజులూరు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఓటింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ పరిశీలనలో భాగంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్.. కరప, కాజులూరు మండలాల్లో పర్యటించారు. కరపలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రాన్ని, అలాగే కాజులూరు మండలం మంశజేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఓటర్ల హాజరు శాతాన్ని, ఓటింగ్ సరళిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడి...