తుఫాను బాధిత వరి రైతులకు పరిహారం చెల్లించాలి.!
తుఫాను బాధిత వరి రైతులకు పరిహారం చెల్లించాలి నేలకొండపల్లి: తుఫానుతో దెబ్బతిన్న వరి పంటలకు ఎకరానికి రూ.40 వేల పరిహారం చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.