రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి.

రేగోడు, నవంబర్ 5 (నా అన్వేషణ నా నిఘా ప్రతినిధి): రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. గురువారం రేగోడు ఐకేపీ కార్యాలయం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో దిగంబర్ పటేల్, మున్నూరు కిషన్, చోటిమియా, తహసీల్దార్ దత్తు రెడ్డి, రాజేందర్ పటేల్, ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.