ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. 306 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు!

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండవ సాధారణ ఎన్నికలు–2026 ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 20 మండలాలకు కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దాపురం మహారాణి కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడలో 160, పెద్దాపురంలో 146 టేబుళ్లు సిద్ధం చేశారు. కౌంటింగ్ విధుల కోసం 346 మంది సూపర్వైజర్లు, 978 మంది టేబుల్ అసిస్టెంట్లు, 600 మంది సహాయక సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు.