ఉమా మార్కండేయేశ్వర ఆలయంలో మార్గాని కుటుంబం ప్రత్యేక పూజలు
రాజమహేంద్రవరం: మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ప్రసూనాంబ, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మోనా దంపతులు, కుమార్తెలు జయని, శివాన్షిలతో కలిసి లక్ష బిల్వార్చన, కోటి కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అనంతరం భరత్ రామ్ మార్కండేయ ఘాట్ దుస్థితి, నగరంలో అసంపూర్తి పనులపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 72 డివిజన్లతో పాటు మేయర్ అభ్యర్థిని బరిలోకి దింపుతామని తెలిపారు. వైసీపీకి ప్రజలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ గుడూరి శ్రీనివాస్, రాధిక, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వాసంశెట్టి...