భక్తి భావంతో ఘనంగా చీవర దానం.. లోభత్వాన్ని వీడి దానగుణాన్ని పెంపొందించుకోవాలి: భంతే అనాలయో

రాజమహేంద్రవరం, నవంబర్ 9: తథాగత బుద్ధ విహార ఆధ్వర్యంలో ఫూలే అంబేడ్కర్ భవన్‌లో పూజ్య భంతే అనాలయోకి చీవర దాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భంతే అనాలయో ఉపాసకులకు త్రిసరణాలు, పంచశీల అందించి ధమ్మ ప్రవచనం చేశారు. లోభమే అనర్థాలకు మూలమని, దానగుణం పెంపొందించుకోవడం ద్వారా లోభత్వాన్ని తగ్గించుకోవచ్చని బోధించారు. బౌద్ధ భిక్షువులు సమాజ హితం కోసం ధర్మబోధ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉపాసకులు, బౌద్ధ ధర్మాభిమానులు పాల్గొన్నారు.