14 వేల మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

జడ్పీటీసీగా తనను సుమారు 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతోందన్నారు. విలీన ఆరు గ్రామాలపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, జడ్పీ చైర్మన్ పదవిపై పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తామని పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు.