అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న అనుశ్రీ సత్యనారాయణ
రాజమహేంద్రవరం: స్థానిక జండా పంజా రోడ్డులో విరమల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు భక్తిశ్రద్ధలతో పడి పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కన్నెస్వాములు అధిక సంఖ్యలో శబరిమల యాత్ర చేపడుతున్నారని, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఈ పూజలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గెడ్డం నాగరాజు, విన్నవాసు, రొక్కం రాజేష్, గగన్ నాయుడు పాల్గొన్నారు.