విద్యతోనే సమాజ ప్రగతి.. ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం!

రామచంద్రపురం: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. విద్య వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ, దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.