Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎన్నికల బందోబస్తుపై ఎస్పీ నిఘా.. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ!

Author
Posted By DONAM NEWTON
| 05 Nov 2026, 05:36 PM | 1 | ఆంధ్రప్రదేశ్

కాకినాడ, నవంబర్ 05: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి టీఆర్‌సీ అప్లికేషన్ ద్వారా పోలీసు వాహనాల లైవ్ లొకేషన్, బలగాల కదలికలను ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ భరోసా ఇచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి