Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సింహ వాహనంపై యోగనారసింహుడు.. వాడపల్లిలో భక్తిభావం!

Author
Posted By జర్నలిస్టు శ్రీనివాస్
| 02 Nov 2026, 01:14 PM | 3 | ఆంధ్రప్రదేశ్
సింహ వాహనంపై యోగనారసింహుడు.. వాడపల్లిలో భక్తిభావం!
వాడపల్లి: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఆదివారం వైభవంగా కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ బహుళ సప్తమి సందర్భంగా ఆలయంలో అర్చకుల ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు

ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాస్నపనం, ప్రధాన హోమాల అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీనివాస కల్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి విశేషార్చనలు, చతుర్వేద స్వస్తి వంటి కార్యక్రమాలు జరిగాయి.

రాత్రి యోగనారసింహ అలంకరణలో స్వామివారిని సింహవాహనంపై ఊరేగించడం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య సింహ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వాడపల్లి క్షేత్రం భక్తజన సందేహంతో కళకళలాడింది.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: